వినుకొండ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణంలోని లయోలా హైస్కూల్ వద్ద గురువారం ఉదయం తుఫాన్ వాహనం - బోలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.