వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సీఐ శోభన్ బాబు, ఎస్ఐ సత్యనారాయణ వారి సిబ్బందితో కలిసి బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు, ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్ లో కొద్ది రోజులు క్రితం స్కూల్, కాలేజీ పిల్లల పట్ల కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.