YCPకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

62చూసినవారు
YCPకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత దేరంగుల ఉదయ్ కిరణ్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు మెయిల్‌లో పంపారు. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేస్తూ వచ్చిన జగన్‌కు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడం సబబేనన్నారు. మోసపూరిత పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్