AP: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇంకెవరి కోసమో కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్‌ను బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెప్తే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పారు. త్వరలోనే కలుస్తానని పవన్ చెప్పారు.