AP: నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాగే ధాన్యం ప్రభుత్వానికి అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని, ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని వెల్లడించారు.