AP: సీఎం చంద్రబాబు విజన్ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి అన్నారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీ-4 గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు చెప్పారని తెలిపారు. గుడ్లవల్లేరును దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని, ఈ మేరకు అక్కడ సర్వే నిర్వహించామని చెప్పారు. వ్యాపారంలో సక్సెస్ కాకపోతే వ్యవసాయం చేసుకునేవాడినన్నారు.