ముగిసిన పర్యావరణ వారోత్సవాలు

78చూసినవారు
చిత్తూరులో నగరంలోని డాక్టర్ వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో బుధవారం పర్యావరణ వారోత్సవాలలో చివరి రోజు సేవ్ ఎనర్జీ అనే అంశంపై కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ, మనకు నిత్య జీవితంలో అతి అవసరమైన నీరు, పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలన్నారు. ఇంధనాల కొరత ఉన్న నేపథ్యంలో వాటి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్