నగరి పట్టణంలోని నారాయణ పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కార్తీక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.