రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

65చూసినవారు
చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాణిపాకం నుంచి బంగారుపాలేనికి బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఇరువారం జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టింది. సంక్రాంతిపల్లెకు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. లారీ రాంగ్ రూట్ లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యాదమరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్