నియోజకవర్గంలో ఓ మోస్తరుగా కురిసిన వర్షం

53చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు గా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దెబ్బకు భయపడి పోయిన ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలు అనంతరం ఒక్కసారిగా వాతావరణం లో మార్పు చోటు చేసుకుంది. ఆకాశమంత నల్లటి మేఘాలు కమ్ముకొని ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ప్రతిరోజు వర్షం పడుతున్నప్పటికీ పగటిపూట ఉష్ణోగ్రతలలో ఏమాత్రం మార్పు రావడం లేదు.

సంబంధిత పోస్ట్