చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండల పరిధిలో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చిత్తూరు వారిచే శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వేలం వేస్తున్నట్లు ఎస్సై షేక్షావలి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు వేలం రుసుం చెల్లించి పాల్గొనాలని ఎస్సై కోరారు.