మైనర్లను పనిలో పెట్టుకోరాదు: ఏఎల్ ఓ

73చూసినవారు
మైనర్లను పనిలో పెట్టుకోరాదు: ఏఎల్ ఓ
మైనర్లను పనులలో పెట్టుకోరాదని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. చిన్నారులను పనులలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్