సంబరాలలో మునిగిన టిడిపి నాయకులు

65చూసినవారు
తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. ఇందుకు కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే. ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంటలోని సచివాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తాము ఎదురుచూస్తున్న సమయం నేటికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్