రైతులందరూ రీసర్వేకు సహకరించాలని రామచంద్రాపురం మండల తహశీల్దార్ వెంకటరమణ తెలిపారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి రామచంద్రాపురం మండలంలోని సొరకాయలపాళ్యం రెవెన్యూలో భూములు రీ సర్వే జరుగుతుందని తహశీల్దార్ వెంకటరమణ అన్నారు. నేటి నుంచి రికార్డుల పరిశీలన, 20 నుంచి 25 వరకు హద్దులు పరిశీలన, 26 నుంచి సర్వే ప్రారంభమవుతుందని చెప్పారు.