పదవులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా

519చూసినవారు
పదవులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా
తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వారి నివాసంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజల కోసం కష్టపడ్డామని, 980కోట్లరూపాయలతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. కరోనా కాలంలోనూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్