తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరంజీవి అభిమాని. ఆయన శ్రీవారి మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ బుధవారం తిరుమలకు బయల్దేరారు. ముందుగా మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన సహచరుల సాయంతో పొర్లు దండాల మీద మెట్లు ఎక్కారు. చిరంజీవి కుటుంబం కోసం 21 ఏళ్లు ఇలా చేస్తున్నట్లు చెప్పారు.