విద్యార్థి దశ నుంచే సేవా భావం కలిగి ఉండటం గొప్ప విషయమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని ఎడిపై పాఠశాల విద్యార్థులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 5లక్షల రూపాయల చెక్ ను ఎమ్మెల్యే పులివర్తి నానికి శుక్రవారం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన ఎడిఫై సంస్థ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలుతో పాటుగా ఎమ్మెల్యే పులివర్తి నాని అభినందనలు తెలియజేశారు.