పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు చిత్తూరు డిఆర్ఓ మోహన కుమార్ శనివారం తెలిపారు. 118 పరీక్షా కేంద్రాలలో 21, 248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. 11 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఫ్లయింగ్ స్క్వాడ్ ఎనిమిది మంది, 40 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.