చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జన్మదిన సందర్భంగా న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెల్మెట్ ను జన్మదిన కానుకగా బుధవారం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుట్టినరోజుకు హెల్మెట్ బహూకరించి తన బాధ్యతను గుర్తు చేశారన్నారు. ఈనెల 23వ తేదీన కూటమి కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు హెల్మెట్ ప్రధానం చేస్తానని తెలిపారు. డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలన్నారు.