ఎటువంటి తప్పిదాలు లేకుండా ఉమ్మడి చిత్తూరులో ఈ నెల 18న నవోదయ పరీక్షలు నిర్వహించాలని ఏడీ రంగస్వామి తెలిపారు. గురువారం డీఈవో కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరులో నవోదయ పరీక్షలకు 26 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 5058 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. మౌలిక వసతులు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.