ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కచ్చితంగా క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.