అలరించిన దుర్యోధన వధ

70చూసినవారు
అలరించిన దుర్యోధన వధ
కార్వేటినగరం మండలంలోని కొల్లాగుంట గ్రామంలో వెలసిన ద్రౌపతి ధర్మరాజుల ఆలయంలో గత 10రోజులుగా మహా భారత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామి అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద నిర్వహించిన దుర్యోధన వధ నాటకం అందరినీ విశేషంగా అలరించింది.

సంబంధిత పోస్ట్