గ్రామాలలో విద్యుత్ లైన్లు, ఇళ్లపైన వెళుతున్నాయని, అలాగే కొన్ని గ్రామాలలో లైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ కోరారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలుచోట్ల గృహాలపైన విద్యుత్ లైన్లు వెళ్తున్నాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు లేవన్నారు.