రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

8994చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో భారతి (50) దుర్మరణం పాలయ్యారు. గడ్డూరుకు చెందిన భారతి మేనల్లుడితో కలిసి ఉగాది పండుగ కోసం గుండిశెట్టిపల్లెలోని సోదరుడి ఇంటికి వెళుతుండగా కారు ఢీకొంది. గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయింది. మృతదేహానికి కుప్పం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్