కుప్పం గ్రామీణ విద్యుత్ శాఖ రెస్కో కార్యాలయంలో మహిళలకు సెలవురోజు ఐన ఆదివారం కూడా పనిచేయాలని రెస్కో ఎండీ హుకుం జారీ చేసినట్లు వినియోగదారులు ఆదివారం తెలిపారు. కావున మహిళలకు మహిళా చట్టం వున్నా రెస్కో లో మాత్రం మేము చెప్పిందే వేదం అన్నట్లు ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతుంటే కుప్పం నాయకులు మరియూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.