కుప్పం: అనారోగ్యంతో జవాను మృతి

78చూసినవారు
జమ్మూ కశ్మీర్ లో మృతి చెందిన జవాన్ పొన్ను స్వామి మృతదేహాన్ని ఆర్మీ అధికారులు ఆయన స్వగ్రామం కుప్పం మండలం అడవిములకలపల్లెకు తరలించారు. విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన పొన్ను స్వామి భౌతికాయానికి ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. శనివారం సాయంత్రం పొన్నుస్వామి మృతదేహానికి అంత్యక్రయలు జరగనున్నాయి. జవాను మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్