భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం కుప్పంలోని అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.