నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన నారాయణ (50) అక్రమంగా నాటు సారా గ్రామస్తులకు అమ్ముతున్నాడని సమాచారం రావడంతో సోమవారం అతని ఇంటిలో సోదాలు చేసి నాటు సారా స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ తిప్పే స్వామి తెలిపారు. నారాయణ ఇంటిలో 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.