ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తిచెంది ఓ గర్భిణీ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రామసముద్రం మండలంలోని తిరుమలరెడ్డిగారి పల్లెకు చెందిన ఏ. వెంకటరమణకు రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి రాడ్లు వేయించుకుని ఇంటికే పరిమితం అయ్యాడు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న సుధారాణి(27) 6 నెలలు గర్భిణీ. ఇంట్లో ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తిచెంది విషంతాగి ఆస్పత్రిలో చేరింది.