వడమాలపేట మండలం పూడి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అంకాలపరమేశ్వరి ఆలయంలో ఆదివారం కార్తీక అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతములతో అభిషేకము చేశారు. అనంతరం అమ్మవారిని వేంకటేశ్వరస్వామిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పీతాంబరం ఆచారి తిరుమల నుండి స్వామి వారి లడ్డూలను తీసుకువచ్చి ప్రసాద వితరణ చేశారు. అర్చకులు జగద్గురు స్వామి విచ్చేసిన భక్తుల గోత్ర నామములతో పూజలు చేశారు.