పుత్తూరు మున్సిపాలిటీలో గాంధీ జయంతి వేడుకలు

58చూసినవారు
పుత్తూరు మున్సిపాలిటీలో గాంధీ జయంతి వేడుకలు
నగిరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో బుధవారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో స్వాతంత్ర సమరంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అందించిన మహనీయుడు గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీజీ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్