తిరుపతి విమానాశ్రయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం సాయంత్రం మంత్రి లోకేష్ తో ఎమ్మెల్యే భాను ప్రకాష్ నియోజకవర్గంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలని మంత్రి ఎమ్మెల్యే కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.