నిండ్ర మండలం, పాత ఆరూరు గ్రామంలో కొలువై ఉన్న అందాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా విశేష పూజలు చేపట్టారు. ఆలయ పూజారి దామోదర్ స్వామి అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. తర్వాత ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు.