నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో గ్రామాలలోని ప్రజలు చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ఒకసారిగా మంచు విపరీతంగా పడుతుండడంతో ఇళ్ల నుంచి అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని ప్రజలు తెలియజేశారు. చిన్నపిల్లలు , వృద్ధులు మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు తెలియజేశారు.