పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు టపాకాయ కాల్చుకుంటూ డ్రమ్స్ మేళ తాళాలతో డిఆర్ఈయు రైల్వే ఉద్యోగ కార్మికులు విజయోత్సవ ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ డి ఆర్ ఈ యు ఘన విజయం సాధించి చెన్నై డివిజన్ మొత్తం ఎర్ర జెండా ఎగరవేయడం జరిగిందన్నారు.