ఉరి వేసుకుని ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

56చూసినవారు
పలమనేరు పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. కాగా లాడ్జి యజమాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బంగారుపాళ్యం కు చెందిన ఆర్మీ ఉద్యోగి సురేష్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్