మంచి సమాజం విద్యా వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మండల పరిధిలోనీ రాయలపేట ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాభివృద్ధిలో సమాజం కీలక భాగస్వామి కావాలన్నారు.