చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చిన్నపిల్లల సంరక్షణ కొరకు వినియోగించే నియోనేటల్ రేడియంట్ వార్మర్ విత్ ఫోటో థెరపీ మిషన్ ను శనివారం ప్రారంభించారు. అనంతరం రాయలపేట వద్ద సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.