పిడుగుపాటు ఓ ఇంట తీరని విషాదాన్ని నింపిన ఘటన ఆదివారం కె. వి పల్లి మండలంలో జరిగింది. నూతన కాల్వ గ్రామం గుట్టలపై నడింపల్లికు చెందిన నాగరాజ నాయుడు(45) పొలం వద్ద పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరో వైపు ఆయన భార్య పార్వతి(37), తల్లి చిన్నక్క(70) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.