కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

8861చూసినవారు
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు మండలంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని రాంపల్లికి చెందిన కుమార్ (33) కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్