పుంగనూరు: నల్లగుట్ట పల్లె తండాలో సారా ఊట ధ్వంసం

61చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నల్లగుట్టపల్లె తండాలో సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించినట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. అలాగే పెద్దపంజాణి మండలం పెద్దరికుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న 768 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రేమ్ నాథ్ ను అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్