పుంగనూరులోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని గంధం, కుంకుమ, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసారు.