పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం గానుగచింత గ్రామంలోని గొల్లపళ్లమ్మ గుడిలో మంగళవారం రాత్రి దొంగలు చోరీ జరుగగా ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఆలస్యంగా స్థానికులు గుర్తించారు. వారి వివరాలు మేరకు ఆలయంలో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు. అనంతరం హుండీలోని నగదును దోచుకొని ముళ్లపొదల్లో పడేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.