సదుం: కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన పూర్వపు విద్యార్థులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో బలిజ వీధికి చెందిన ముని రాజా గత కొద్దిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. సమాచారం తెలుసుకున్న 1993-94 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు అతనికి ఆదివారం రూ. 44, 500 నగదు తో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో నాగ శేషారెడ్డి, హేమలత, సిలార్, అబీద్, గిరీష్ పాల్గొన్నారు.