బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
రామసముద్రంలోని దిగువ హరిజనవాడకు చెందిన గోవిందును కొందరు అగ్రకులాల వర్ణాల వారు టమాటా దొంగతనం చేశాడన్న నెపంతో దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. బాధితుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాల మహానాడు సంఘం నాయకులు సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు.