
పెద్దిరెడ్డిని కలిసిన సత్యవేడు వైసీపీ నాయకులు
తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ కీలక నేత నిరంజన్ రెడ్డి బుధవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు.