సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీలపూడి సచివాలయంలో ఎన్పీసీఐ క్యాంపు, ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాంపును ఎంపీడీవో మహమ్మద్ రఫీ గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.