సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలానికి చెందిన టీడీపీ నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండల అభివృద్ధి గురించి కలెక్టర్ తో చర్చించారు. అన్ని పనులను త్వరితగతిన చేసేందుకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ భాస్కరణ్, సుబ్రహ్మణ్యం, హరి, రాజశేఖర్ పాల్గొన్నారు.