దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.