జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం చిత్తూరులో జరిగింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ కావేరి తిరుమలయ్య పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు ఎంపీడీవో వారి కార్యాలయం భవనం శిథిలావస్థలో ఉందని జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు.